ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫెయిల్యూర్ గా నిలిచింది.

By Medi Samrat
Published on : 13 April 2024 3:00 PM IST

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫెయిల్యూర్ గా నిలిచింది. మొదటి షో పడగానే సినిమా మీద నెగటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసేశారు. పనిగట్టుకుని కొందరు సినిమా మీద వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. దీనిపై చిత్ర బృందం పోలీసులను కూడా ఆశ్రయించింది. ఇలాంటి పరిస్థితిలో సినిమా ఇక ఓటీటీలో ప్రజలను పలకరించబోతోంది.

ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పటి వరకూ 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగలిగింది. ఆ సినిమా బడ్జెట్.. చేసిన వ్యాపారాన్ని చూస్తే చాలా షాకింగ్ గా అనిపించవచ్చు. ఈ సినిమా పెట్టుబడిలో బయ్యర్లు 70% పైగా నష్టపోయారు. వారాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లు పెద్దగా ఊపందుకోలేకపోయింది. ఇక ఫ్యామిలీ స్టార్ మే 3 నుండి ప్రముఖ OTT దిగ్గజం Amazon Primeలో ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. గీత గోవిందం తర్వాత పరశురామ్.. విజయ్ దేవరకొండల బ్లాక్‌బస్టర్ కాంబో ఫ్యామిలీ స్టార్ ను హిట్ చేయలేకపోయాయి. సినిమా మీద అంచనాలను పెంచేందుకు నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్ ఎంత ప్రయత్నించినా ఆ వ్యూహాలు ఫలించలేదు.

Next Story