మొదలైన ఎఫ్-3.. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్

F3 Movie Launched With Pooja Ceremony. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా గత సంవత్సరం విడుదలైన

By Medi Samrat  Published on  17 Dec 2020 6:50 PM IST
మొదలైన ఎఫ్-3.. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా గత సంవత్సరం విడుదలైన చిత్రం 'ఎఫ్-2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా 'ఎఫ్-3' సినిమా ఉండబోతోందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావి పూడి ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నానని గతంలో చెప్పాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. సినిమా రెగ్యులర్ షూటింగును 23 నుంచి ప్రారంభించనున్నామని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తమ వద్ద మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉందని, మరింత వినోదానికి సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ముహూర్తపు షాట్ ను వరుణ్ తేజ్, తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.

దిల్‌రాజు ఎఫ్-3 కోసం ఎక్కువగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ కు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెంక‌టేశ్ కు రూ.12 కోట్లు, వ‌రుణ్ తేజ్‌కు రూ.8 కోట్లు, త‌మ‌న్నా రూ.2 కోట్లు, మెహ‌రీన్ రూ.70 ల‌క్ష‌లు, సునీల్ రూ.75 ల‌క్ష‌లు, దేవీ శ్రీ ప్ర‌సాద్ రూ.3 కోట్లు ఇస్తున్నాడ‌ట దిల్ రాజు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి రూ.12 కోట్లు ఇస్తున్నాడ‌ని సమాచారం. ఎఫ్ 3 సినిమా కోసం మేక‌ర్స్ కేవ‌లం రెమ్యున‌రేష‌న్స్ కోస‌మే రూ. 50 కోట్లు వెచ్చిస్తున్నాడ‌ని చెబుతున్నారు. 70 రోజుల్లో సినిమా షూటింగ్ ను పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు.




Next Story