అనిల్ రావిపూడి F3 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అయితే.. అనిల్ రావిపూడికి ఇది మొదటిసారి కాదు.. ఆయన గత చిత్రాలకు కూడా ఇలానే ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆ ట్రోల్స్ ను ఆపడానికి ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. తాను సినిమాలు చేస్తూనే ఉంటానని పేర్కొన్నాడు. తాను సినిమాలు తీయడం ఆపనని.. నెగెటివిటీని తన గుండెల్లో పెట్టుకోనని చెప్పాడు.
అనిల్ రావిపూడి ట్రోలర్స్‌ను మాంసాహారులతో పోల్చారు, ఓ వ్యక్తి ఆహార ఎంపికను పోల్చడం ద్వారా శాఖాహారులను అవమానపరిచారు. మాంసాహారులకు శాఖాహారం రుచి ఎలా ఉంటుందో తెలియదు. శాకాహారులు ఆ వ్యాఖ్యల కారణంగా తినడం మానేయరని తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఈరోజు విడుదలైన F3 సినిమా అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.