సన్నగా ఉన్నందుకు సిగ్గుపడ్డాను.. దక్షిణాది సినీ చిత్ర పరిశ్రమపై న‌టి విమర్శలు

Erica Fernandes was 'thin-shamed a lot' in South film industry. 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ' చిత్రంలో సోనాక్షి పాత్రను పోషించిన తర్వాత ఎరికా ఫెర్నాండెజ్

By Medi Samrat  Published on  7 Feb 2022 6:13 PM IST
సన్నగా ఉన్నందుకు సిగ్గుపడ్డాను.. దక్షిణాది సినీ చిత్ర పరిశ్రమపై న‌టి విమర్శలు

'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ' చిత్రంలో సోనాక్షి పాత్రను పోషించిన తర్వాత ఎరికా ఫెర్నాండెజ్ కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆమె టీవీ రంగంలో రాణించడానికి ముందు.. 2013 నుండి అనేక దక్షిణాది చిత్రాలలో పనిచేసింది. 2016లో ఆమె హిందీ టీవీ సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది. నటి టీవీలో అత్యంత డిమాండ్ ఉన్న తారలలో ఒకరిగా వెలుగొందుతోంది. ఇటీవల ఎరికా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాడీ-షేమ్‌ గురించి మాట్లాడింది. ఆమె బాలీవుడ్ బబుల్‌తో మాట్లాడుతూ, "నేను చాలా సన్నగా ఉన్నందుకు సిగ్గుపడ్డాను. దక్షిణాదిలో హీరోయిన్లు బొద్దుగా ఉంటే ఇష్టపడేవారు. అక్కడ సినిమాలు చేసే సమయంలో నా శరీరంపై ప్యాడ్స్‌ పెట్టి మేనేజ్‌ చేయడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే నాకు సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యేదాన్ని. ప్యాడ్స్‌ పెట్టుకుని నటించేందుకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండేది.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరినీ యాక్సెప్ట్‌ చేస్తున్నారు. అది సంతోషకరమైన పరిణామం" అని ఎరికా చెప్పుకొచ్చింది. "వారు నన్ను నింపేవారు. నేను చాలా ప్యాడింగ్ వేసుకునేదాన్ని నా గురించి నాకు చాలా బాధగా అనిపించేది. మీరు ఆ వ్యక్తిని వారిలాగే అంగీకరించకపోవడం అసౌకర్యంగా ఉంది. వారు ప్రతిచోటా ప్యాడింగ్‌లు వేసేవారు "ఆమె వివరించి చెప్పింది. 2011లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌, 2010, 2011లో పాంటలూన్స్‌ ఫెమినా మిస్‌ మహారాష్ట్ర అవార్డులు గెలుచుకుంది ఎరికా ఫెర్నాండేజ్‌. తెలుగులో 'గాలిపటం' సినిమాలో కథానాయికగా కనిపించింది. కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా ఆమె నటించింది.


Next Story