అడివి శేష్ ‘గూఢచారి-2’ సెట్స్‌లో గాయ‌ప‌డ్డ బాలీవుడ్ హీరో..!

ఇమ్రాన్ హష్మీ ఇటీవలే 'గూడాచారి 2' షూటింగ్‌లో భాగ‌మ‌య్యాడు. అయితే హైదరాబాదులో ఓ బారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ హష్మీ మెడకు గాయమైంది

By Medi Samrat  Published on  7 Oct 2024 9:56 PM IST
అడివి శేష్ ‘గూఢచారి-2’ సెట్స్‌లో గాయ‌ప‌డ్డ బాలీవుడ్ హీరో..!

ఇమ్రాన్ హష్మీ ఇటీవలే 'గూడాచారి 2' షూటింగ్‌లో భాగ‌మ‌య్యాడు. అయితే హైదరాబాదులో ఓ బారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ హష్మీ మెడకు గాయమైంది. జంప్ సీక్వెన్స్‌లో ఇమ్రాన్ హష్మీ గాయపడ్డాడని.. ఆ కారణంగా ఆయ‌న‌ మెడపై లోతైన కోత పడిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోటోలో ఇమ్రాన్ హష్మీ గాయాంపై రక్తం కూడా కనిపిస్తుంది. దీంతో ఆయ‌న‌ అభిమానుల ఆందోళనకు గుర‌వుతున్నారు.

నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ హష్మీ కష్టమైన స్టంట్ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ గాయానికి గురయ్యాడు. ఇమ్రాన్ ఒక యాక్షన్ సన్నివేశం చేస్తున్నప్పుడు ఆయ‌న‌ మెడకు గాయమైంది. జంపింగ్ సన్నివేశంలో ఇది సంభవించిందని యూనిట్ పేర్కొంది. గాయానికి చికిత్స పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇమ్రాన్ హష్మీ త్వరలో చిత్రీకరణను పునఃప్రారంభించే అవ‌కాశం ఉంది. ఆగస్ట్‌లో ఇమ్రాన్ హష్మీ నటుడు అడివి శేష్ హీరోగా న‌టిస్తున్న‌ గూడాచారి-2 లో న‌టిస్తున్నట్లు ప్రకటించారు. గూడాచారి-1 మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

Next Story