'ఈ నగరానికి ఏమైంది' రీ రిలీజ్.. మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయ్‌..!

Ee Nagaraniki Emaindi has been re-released in theaters. యూత్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.

By Medi Samrat  Published on  3 July 2023 9:31 AM IST
ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్.. మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయ్‌..!

యూత్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. దీనిపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని రీ రిలీజ్ చేశామ‌ని.. మంచి స్పందన వ‌స్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నగరానికి ఏమైంది చిత్రం రీ రిలీజ్ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న క్యాపిటల్ సినిమాస్ నందు చిత్ర యూనిట్.. ప్రేక్షకులతో కొద్దిసేపు ముచ్చటించింది. అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. గోవా ట్రిపు వెళ్లే నలుగురు చిన్ననాటి స్నేహితుల ఆధారంగా 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాన్ని నిర్మించి 2018 జూన్‌లో రిలీజ్ చేశామని అప్పట్లో ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు. అయితే ఇటీవల ఈ చిత్రాన్ని ఒకటి లేదా రెండు రోజులు సినిమా ప్రదర్శిద్దామని రీ రిలీజ్ చేశామని.. కానీ ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందన లభించడంతో చిత్రాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. విజయవాడ, హైదరాబాద్‌లో కూడా మంచి స్పందన లభిస్తుందని అన్నారు.

తన తొలిచిత్రం పెళ్లి చూపులు మంచి సక్సెస్ సాధించిందని.. విజయయాత్ర విజయవాడ నుంచే ప్రారంభించామని తెలిపారు. అలాగే తన మూడవ చిత్రం 'కీడా కోలా' చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిందని.. త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రూపొందింద‌ని తెలిపారు. సురేష్ మూవీస్ మేనేజర్ ఎంవీఎస్ భగవాన్ మాట్లాడుతూ.. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం రీ రిలేజ్ మంచి ఆదరణ పొందుతుందని.. మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. గత నెల 29న రిలీజ్ చేశామని.. ఇంకా కొనసాగుతుందని తెలిపారు.


Next Story