ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన దర్శకుడు వంశీ.. భావోద్వేగం

ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ ఇటీవల కూలిపోయిన 'సినిమా చెట్టు' దగ్గరకు వెళ్లారు.

By Medi Samrat  Published on  9 Aug 2024 8:30 PM IST
ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన దర్శకుడు వంశీ.. భావోద్వేగం

ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ ఇటీవల కూలిపోయిన 'సినిమా చెట్టు' దగ్గరకు వెళ్లారు. ఆయన సినిమాల్లో ఈ చెట్టు దగ్గర సీన్స్ తప్పకుండా ఉండేవి. దీంతో కూలిపోయిన చెట్టును చూసిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘సినిమా చెట్టు’ కుమారదేవం గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందని.. నేను అన్ని సినిమాల్లో ఈ ఫేమస్ చెట్టు దగ్గర కనీసం ఒక్క షాట్ అయినా తీసేవాడినని తెలిపారు. ఈ చెట్టు దగ్గర తీసిన చాలా సినిమాలు హిట్టయ్యాయని అన్నారు. 155 ఏళ్లుగా బతికిన ఈ చెట్టును మళ్లీ జీవం పోయడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఆలోచిస్తున్నాయని తెలిసి సంతోషిస్తున్నానన్నారు.

1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు వంటి సినిమాల్లో ముఖ్యమైన సీన్స్‌ను ఇక్కడే చిత్రీకరించారు. కుమారదేవం గ్రామంలో కూలిన సినిమా చెట్టును జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం పరిశీలించారు. చెట్టుకు ప్రాణం పోసేలా పునరుద్ధరణ చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఇందుకు రోటరీ క్లబ్ సహకారం తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

Next Story