క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్న దర్శకుడు శంకర్ కుమార్తె
Director Shankar's daughter Aishwarya to marry TNPL cricketer. భారత్ లోనే గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి ఫిక్స్ అయ్యింది.
By Medi Samrat Published on
26 Jun 2021 10:01 AM GMT

భారత్ లోనే గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి ఫిక్స్ అయ్యింది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఆమె వివాహం జరగబోతోంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తి రీత్యా డాక్టర్. రోహిత్ దామోదరన్ తండ్రి దామోదరన్ పారిశ్రామికవేత్త. మధురై పాంథర్స్ టీమ్ జట్టుకు స్పాన్సర్ కూడా ఆయనే. కరోనా కారణంగా తక్కువ మంది సమక్షంలో పెళ్లి నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మహాబలిపురంలో ఈ వివాహం జరగనుంది. కేవలం దగ్గర బంధువులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే వివాహానికి హాజరుకానున్నారు.
మహాబలిపురంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధు మిత్రులనే ఆహ్వానిస్తున్నారు. కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇదే యేడాది మే నెలలో శంకర్ తల్లి కన్నుమూశారు. శంకర్ కమల్ హాసన్ తో 'ఇండియన్ -2'ను తెరకెక్కిస్తున్నారు. తర్వాత రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీని, రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' హిందీ రీమేక్ ను చేయబోతున్నాడు.
Next Story