డైరెక్టర్ కూతురి పెళ్లికి హాజరైన సీఎం.. ఫోటోలు వైరల్
Director Shankar Daughter Marriage. ఇండియన్ జేమ్స్ కామోరూన్.. శంకర్ కుమార్తె వివాహం నేడు ఘనంగా జరిగింది. శంకర్ పెద్ద కుమార్తె
By Medi Samrat Published on
27 Jun 2021 9:43 AM GMT

ఇండియన్ జేమ్స్ కామోరూన్.. శంకర్ కుమార్తె వివాహం నేడు ఘనంగా జరిగింది. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో కలిసి కొద్ది కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా ఈ వివాహ వేడుక మహాబలిపురంలో నిరాడంబరం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఇక ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు.
ఐశ్యర్య, రోహిత్ దామోదరన్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శంకర్ అభిమానులు వారికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలావుంటే.. శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. పెళ్లికూతురు ఐశ్యర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇక రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. రోహిత్ తండ్రి రామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ కూడా వ్యవహరిస్తున్నాడు.
Next Story