అది ఇవ్వడానికే మంత్రి పేర్ని నానిని కలిశాం: దిల్‌రాజు

Dilraju meets minister perni nani to discuss movie related issues. ఏపీ మంత్రి పేర్ని నానితో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. సచివాలయంలో మంత్రి పేర్ని

By అంజి
Published on : 29 Oct 2021 2:08 PM IST

అది ఇవ్వడానికే మంత్రి పేర్ని నానిని కలిశాం: దిల్‌రాజు

ఏపీ మంత్రి పేర్ని నానితో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. సచివాలయంలో మంత్రి పేర్ని నానిని నిర్మాతలు దిల్‌రాజు, అలంకార్‌ ప్రసాద్‌, బన్నీ వాసు, వంశీలు కలిసి మాట్లాడారు. గురువారం నాడు.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి, సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చట్టానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో వారు మాట్లాడినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై గత కొన్ని రోజులుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్‌ నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే నిన్న సినీ హీరో నాగార్జున.. సీఎం జగన్‌తో భేటీ అయి మాట్లాడారు. భేటీ అనంతరం నిర్మాత్‌ దిల్‌రాజ్‌ మాట్లాడారు. ప్రభుత్వం తమ నుంచి కొంత సమాచారాన్ని అడిగిందన్నారు. అది ఇవ్వడానికే మంత్రి పేర్ని నానిని కలిసినట్లు దిల్‌రాజ్‌ తెలిపారు.

Next Story