Dasara Movie Pre Release Event. నాని హీరోగా, కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన సినిమా 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన
By Medi Samrat Published on 24 March 2023 3:45 PM GMT
Hero Nani
నాని హీరోగా, కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన సినిమా 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ను, వేదికను ఖరారు చేశారు. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 26వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ SLVC.. ‘ధూమ్ ధామ్ దసరా సెలబ్రేషన్స్‌కు గెట్ రెడీ’ అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి.
ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గోదావరిఖని సింగరేణి ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందగా ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ధరణి పాత్రలో నటించిన నాని బొగ్గు దొంగతనం చేసే యువకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెన్నెల క్యారెక్టర్‌లో కీర్తి సురేష్, ఫ్రెండ్ సూరి క్యారెక్టర్‌లో దీక్షిత్ శెట్టి నటించారు.