'దసరా' మూవీ: సెన్సార్, రన్‌టైమ్‌తో సహా పూర్తి వివరాలివే.!
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'దసరా' సినిమా మేనియా నడుస్తోంది. 'దసరా' మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సమే ఇందుకు కారణం.
By అంజి Published on 17 March 2023 3:00 PM IST'దసరా' మూవీ: సెన్సార్, రన్‌టైమ్‌తో సహా పూర్తి వివరాలివే.!
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'దసరా' సినిమా మేనియా నడుస్తోంది. 'దసరా' మూవీ ట్రైలర్ సృష్టించిన బీభత్సమే ఇందుకు కారణం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఒదెల రియలిస్టిక్ విధానంతో సినిమా తీశారు. ట్రైలర్ కూడా అద్భుతంగా కట్ చేశారు. ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. నాని బీస్ట్ మోడ్ మాములుగా లేదు. మార్చి 30న దసరా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ దేశ సినీ ప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే దసరాకి మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి. సినిమాలో భారీగా క్రైమ్ సీన్లు ఉన్నప్పటికీ.. 'దసరా'కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కొన్ని బీప్‌లు, చిన్న కట్‌లు మినహా సెన్సార్ బోర్డ్ 'దసరా' సినిమాను కుటుంబాలు, పిల్లలతో సహా అన్ని రకాల ప్రేక్షకులు ఈ మూవీని చూడొచ్చని తెలిపింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాలు. కమర్షియల్ సినిమాకి ఇది సరైన రన్‌టైమ్. సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. దసరా ట్రైలర్ చూస్తే ప్రతీకార కథలా కనిపిస్తోంది. ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు.
ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. 'దసరా' సినిమాలో చాలా సహజమైన, అసలైన ప్రేమకథ, గొప్ప స్నేహం, వర్గ విభేదాలు, ప్రేక్షకులను అలరించే అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్‌కు గొప్ప ప్రారంభం కానుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదలకానుంది. నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సంతోష్ నారాయణ మ్యూజిక్ అందించారు. ఇటీవలే విడుదలైన చమ్కీల అంగీలేసి పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.