ముంబై రోడ్డుపై తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న కారు.. కారులో ఉన్న వాళ్లను చూసి షాకైన తెలుగు పిల్లాడు

Cute kid Meet Puri Jagannadh in mumbai traffic signal. ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు TS, AP అనే రిజిస్ట్రేషన్ ఉన్న కార్లను చూస్తే.. మన తెలుగు

By Medi Samrat  Published on  25 Oct 2021 7:26 AM GMT
ముంబై రోడ్డుపై తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న కారు.. కారులో ఉన్న వాళ్లను చూసి షాకైన తెలుగు పిల్లాడు

ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు TS, AP అనే రిజిస్ట్రేషన్ ఉన్న కార్లను చూస్తే.. మన తెలుగు వాళ్లే వెళుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో చదువుకునే వాళ్లకు, ఉద్యోగాలు చేసే వాళ్లకు ఇలా వాహనాలకు ఉండే రిజిస్ట్రేషన్స్ విషయంలో కాస్త అవగాహన ఉంటుంది. అలా ఓ పిల్లాడు ముంబై రోడ్డుపై తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న కారును చూశాడు. చూడగానే ఆ కారు దగ్గరకు వచ్చాడు. ఆ కారులో ఉన్న వాళ్ళను చూడగానే పిల్లాడు కాస్తా షాక్ అయ్యాడు.

ఎందుకంటే ఆ కారులో ఉన్నది దర్శకుడు పూరీ జగన్నాథ్..! పిల్లాడు తాను TS రిజిస్ట్రేషన్ చూడగానే మన తెలుగు వాళ్లు ఉంటారని అనుకుని వచ్చానని.. తీరా చూస్తే మీరు ఉన్నారు సార్ అని ఆ పిల్లాడు చెప్పుకొచ్చాడు. తన దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు ఫోటో తీసుకుందామని అనుకుంటే.. అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తాను ఇంటర్ చదువుతూ ఉన్నానని చెప్పుకొచ్చాడు. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆ పిల్లాడు చెబుతూ ఉంటే పూరీ కూడా ఎంతో ఆనంద పడ్డాడు.

Advertisement

లైగర్ సినిమా సమ్మర్ లో విడుదల అవుతుందని తప్పకుండా చూడాలని పూరీ అనగా.. తాను కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని పిల్లాడు చెప్పాడు. ట్విట్టర్ లో పెడతారు కదా అని ఆఖర్లో ఆ పిల్లాడు వెల్లడించాడు. దీన్ని మొత్తం పక్కనే ఉన్న వాళ్లు రికార్డు చేశారు. ఛార్మీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి లైగర్ సినిమాను భారీ స్థాయిలో చిత్రీకరిస్తూ ఉన్నారు. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎక్కువ భాగం సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.


Next Story
Share it