ర‌జినీకాంత్‌కు క‌రోనా షాక్‌.. నిలిచిపోయిన 'అన్నాత్తే' షూటింగ్.. టెన్ష‌న్‌లో త‌లైవా..

Corona Shock To Rajinikanth. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా షాకిచ్చింది. కొవిడ్ కార‌ణంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా

By Medi Samrat  Published on  23 Dec 2020 5:41 PM IST
ర‌జినీకాంత్‌కు క‌రోనా షాక్‌.. నిలిచిపోయిన అన్నాత్తే షూటింగ్.. టెన్ష‌న్‌లో త‌లైవా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా షాకిచ్చింది. కొవిడ్ కార‌ణంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే' షూటింగ్ నిలిచిపోయింది. ఈ చిత్ర బృందంలోని ఎనిమిది మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో వెంట‌నే షూటింగ్‌ను నిలిపివేశారు. సంక్రాంతి క‌ల్లా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. రాజ‌కీయాల్లో బిజీ కావాల‌నుకున్న ర‌జ‌నీకాంత్ ఇప్పుడు టెన్ష‌న్‌లో ప‌డ్డారు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే.. క‌రోనా ప‌రీక్ష‌ల్లో ర‌జ‌నీకాంత్‌కు నెగెటివ్ రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

ర‌జినీకాంత్ హీరోగా శివకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం అన్నాత్తే. స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కీర్తిసురేష్‌, న‌య‌న‌తార‌, ఖుష్భు , మీనా వంటి భారీ తారాగ‌ణం ఇందులో న‌టిస్తుంది. రీసెంట్‌గానే ర‌జినీకాంత్‌తో సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. సంక్రాంతి వ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని భావించిన ర‌జినీకాంత్.. రోజుకు 14 గంట‌ల పాటు షూటింగ్‌లో పాల్గొంటున్నాడ‌ట‌. కాగా.. యూనిట్‌లో కొంత‌మంది సిబ్బంది అనారోగ్యానికి గురికావ‌డంతో కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వ‌చ్చింది. దీంతో వెంట‌నే షూటింగ్‌ను నిలిపివేశారు. ర‌జ‌నీకాంత్ వెంట‌నే క్వారంటైన్‌లోకి వెళ్లారు.


Next Story