హైపర్ ఆదిపై ఫిర్యాదు.. అప్పుడు ఆనాధలు.. ఇప్పుడు తెలంగాణ భాష
Complaint Against Hyper Aadi. జబర్దస్త్ టీవీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ షోలోని
By Medi Samrat Published on 14 Jun 2021 4:17 PM ISTజబర్దస్త్ టీవీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ షోలోని కొన్ని స్క్రిప్ట్స్ గతంలో కూడా ఎంతో వివాదాస్పదం అయ్యాయి. కొందరిపై దాడులు కూడా జరిగాయి. హైపర్ ఆది స్క్రిప్ట్ ల విషయంలో కూడా గతంలో కొన్ని వివాదాలు కొనసాగాయి. తాజాగా హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణ భాషను హైపర్ ఆది కించపరిచారు అంటూ కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తూ ఉండగా.. ఇప్పుడు కొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి సోమవారం వీరు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్ లో ఆదిపై ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ భాషని, బతుకమ్మని, గౌరమ్మని కించపరిచేలా మాట్లాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదితోపాటు ఆ స్కిట్ రైటర్‌పై, మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. గతంలో కూడా హైపర్ ఆదిపై మానవ హక్కుల సంఘానికి(హెచ్‌ఆర్సీ)కి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే..! తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ ప్రదర్శిస్తున్నారంటూ అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.