డ్ర‌గ్స్ కేసులో లేడి క‌మెడియ‌న్ దంప‌తుల అరెస్ట్‌

Comedian Bharati Singh Arrested in drugs case. బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. డ్ర‌గ్స్ కేసులో ప్ర‌ముఖ

By Medi Samrat  Published on  22 Nov 2020 8:37 AM GMT
డ్ర‌గ్స్ కేసులో లేడి క‌మెడియ‌న్ దంప‌తుల అరెస్ట్‌

బాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. డ్ర‌గ్స్ కేసులో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ భార‌తి సింగ్‌, ఆమె భ‌ర్ హ‌ర్ష్ లింబాచియ్యాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. శ‌నివారం కమెడియన్ భారతి సింగ్ నివాసంతో పాటు ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఈ రెండు చోట్ల 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచార‌ణ‌లో వారు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఒప్పుకున్నారని.. నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో ఇరువురినీ అరెస్ట్ చేసిన‌ట్లు అధికారులు వెల్లడించారు.

డ్ర‌గ్స్ కేసులో గ‌తంలో అరెస్టు చేసిన డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన ఓ వ్య‌క్తిని విచారించ‌గా.. అత‌డు భార‌తిసింగ్ పేరును వెల్ల‌డించ‌డంతో..అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. సుశాంతత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. విచార‌ణ చేప‌ట్టిన ఎన్‌సీబీ అధికారులు న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు నిర్థారించి అరెస్టు చేశారు. ఆమెతో పాటు న‌టి సోద‌రుడు, ప‌లువురిని అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ డ్ర‌గ్స్ విచార‌ణ ఎదుర్కొన్నారు. అలాగే న‌టుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు చేసింది. రాంపాల్, అత‌ని గ‌ర్ల్‌ప్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రీయేడ్స్ ఇద్ద‌రినీ ప్ర‌శ్నించింది. అయితే.. త‌న నివాసంలో ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్న‌వి ప్రిస్ర్కిప్ష‌న్‌లో భాగ‌మ‌ని రాంపాల్ చెప్పాడు. ప్రిస్కిప్ష‌న్ మేర‌కు మందులు వాడుతున్నాను త‌ప్ప‌, త‌న‌కు డ్ర‌గ్స్‌తో సంబంధం లేద‌ని పేర్కోన్నాడు.


Next Story