మీరు అలా చేయండి.. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం : సీఎం రేవంత్
8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 26 Dec 2024 2:10 PM IST8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం.. ఐటీ, ఫార్మాతో మాకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యం అన్నారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామని.. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్డీసీ ఛైర్మన్గా నియమించాం.. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్కు రెండు గంటలల్లో రావొచ్చు.. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండని సూచించారు. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది.. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ.. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.
హైదరాబాద్లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం.. పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం అన్నారు. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు.. సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి.. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం.. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది.. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు.. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం.. మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.