క‌రోనా పాజిటివ్ అని కన్ఫ్యూజ్‌ చేసి.. ఆడేసుకున్నారు : చిరంజీవి

Chiranjeevi Tests Corona Negative. రెండు రోజుల‌క్రితం మెగాస్టార్‌ చిరంజీవికి క‌రోనా సోకినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించిన

By Medi Samrat  Published on  12 Nov 2020 10:56 PM IST
క‌రోనా పాజిటివ్ అని కన్ఫ్యూజ్‌ చేసి.. ఆడేసుకున్నారు : చిరంజీవి

రెండు రోజుల‌క్రితం మెగాస్టార్‌ చిరంజీవికి క‌రోనా సోకినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఎటువంటి లక్షణాలు ఆయనకు లేవని, కనిపించలేదని తెలిపారు. రెండు రోజుల వరకు వెయిట్‌ చేసినా.. తనలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి మరోసారి మెగాస్టార్‌ టెస్ట్ చేయించారు. అక్కడ నెగిటివ్‌ రావడంతో దానినే ఫైనల్‌గా తీసుకోకుండా.. ఇంకా రెండు చోట్ల టెస్ట్‌లు చేయించారు. అక్కడ కూడా నెగిటివ్‌ రావడంతో తనకు పాజిటివ్‌ చూపించిన కిట్‌ సరిగా లేదనే నిర్థారణకు వచ్చినట్లుగా చెబుతూ తాజాగా చిరంజీవి ట్వీట్‌ చేశారు.



అలాగే.. కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్‌ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్‌ రిపోర్ట్ అన్న తర్వాత, ట్రీట్‌మెంట్‌ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా.. ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోలో డాక్టర్స్ తో పాటు టెనెట్‌ ల్యాబ్‌, మొద‌టిసారి పాజిటివ్‌ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా చెక్‌ చేయించాను. ఈ మూడు రిపోర్టులలో కూడా నెగిటివ్ అని తేలింది. దీంతో మొదటి రిపోర్ట్ తప్పుడు కిట్‌ వలన వచ్చిందని డాక్టర్స్‌ నిర్థారణకి వచ్చారు. ఈ సమయంలో మీరందరు చూపించిన ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.." అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Next Story