చిరంజీవి చేతుల మీదుగా గల్లీ రౌడీ ట్రైలర్ రిలీజ్..!

Chiranjeevi Releases Gully Rowdy Trailer. యంగ్ హీరో సందీప్ కిషన్ గల్లీ రౌడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

By Medi Samrat  Published on  12 Sept 2021 10:36 PM IST
చిరంజీవి చేతుల మీదుగా గల్లీ రౌడీ ట్రైలర్ రిలీజ్..!

యంగ్ హీరో సందీప్ కిషన్ గల్లీ రౌడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గల్లీ రౌడీ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేశారు. 'గల్లీ రౌడీ' ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న 'స్టేట్ రౌడీ' అంటూ ఎనౌన్స్ మెంట్ పోస్టర్‌ను వదిలారు. సందీప్ కిషన్ జోడీగా నేహా శెట్టి ఈ సినిమాతో పరిచయమవుతోంది. రాజేంద్రప్రసాద్ .. వెన్నెల కిషోర్ … పోసాని కృష్ణమురళి.. బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రైలర్ చూస్తే బాగా కామెడీతో సినిమా ఉండేలా కనిపిస్తోంది. సమస్యలో చిక్కుకున్న కుటుంబానికి సహాయం చేసే క్రమంలో రౌడీ పాత్రలో సందీప్ కిషన్ ఈ సినిమాలో కనిపించాడు. ఇక ఎక్కువశాతం కామెడీ కంటెంట్‌తో సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులతో నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమా కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. తెలుగు సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఓపెనింగ్స్, కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే సక్సెస్ ఫుల్ సినిమాగా నిలదొక్కుకుంటుంది.


Next Story