నన్ను తన్నడానికి చిరు ఇబ్బంది పడ్డారు : సోనూసూద్
Chiranjeevi Refused to Beat up 'Hero' Sonu Sood in an Action Scene. కరోనా కారణం వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన
By Medi Samrat Published on 21 Dec 2020 10:28 AM ISTకరోనా కారణం వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ఎంతో మంది వలస కూలీలకు తమ వంతు సాయం అందించి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించిన సోను సూద్ అందరికీ హృదయాలలో రియల్ హీరోగా నిలిచాడు. తన వృత్తి పరంగా సినిమాలలో ప్రతినాయకుడు పాత్రను పోషించే సోను సూద్ నిజ జీవితంలో తన వంతు సాయంగా ఎంతోమందిని ఆదుకొని అందరి చేత రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
ప్రస్తుతం సోనుసూద్ చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సోను సూద్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా సమయంలో షూటింగ్ వాయిదా పడటంతో చిత్ర నిర్మాణం ఆగిపోయింది.ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణం తిరిగి జరుపుకుంటున్న నేపథ్యంలో సోను సూద్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
తాజా షెడ్యూల్ లో భాగంగా సోనుసూద్ చిరంజీవి కొన్ని యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. ఈ చిత్రీకరణ సమయంలో చిరంజీవి సోను సూద్ కొట్టడానికి ఎంతో ఇబ్బంది పడినట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ఈ ఈ సన్నివేశం చిత్రీకరణ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు సోనుసూద్ దగ్గరికి వెళ్లి ఆపద సమయంలో ఎంతోమందిని ఆదుకున్న నిజమైన హీరోని కొట్టడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఒకవేళ కొట్టిన ప్రజలందరూ నన్ను తిట్టుకుంటారని అన్నారు. అంతే కాకుండా ఓ సన్నివేశంలో చిరంజీవి గారు నాపై కాలు పెట్టాల్సిన సీను ఉంటే దానిని కూడా రీ షూట్ చేశామని సోను సూద్ తెలిపారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సోనుసూద్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుంచి ప్రతినాయకుడి పాత్ర పోషించనని ఈ సందర్భంగా తెలిపారు. హీరోగా అవకాశం వచ్చాయి. ఇప్పటికే 4 మంచి కథలు నా వద్దకు వచ్చాయని,ఇప్పటి నుంచి ప్రతినాయకుడు పాత్రలకు స్వస్తిపలికి హీరో పాత్రలో నటిస్తానని సోను సూద్ తెలియజేశారు.