డర్టీ హరి.. నిర్మాతపై కేసు నమోదు

Case against 'Dirty Hari' makers. డ‌ర్టీ హ‌రి.. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ

By Medi Samrat  Published on  14 Dec 2020 3:22 PM IST
డర్టీ హరి.. నిర్మాతపై కేసు నమోదు

డ‌ర్టీ హ‌రి.. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాని డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లయ్యాయి. తాజాగా డ‌ర్టీ హ‌రి నిర్మాత‌పై కేసు న‌మోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్ పై అతికించిన సినీ పోస్టర్ల పై కేసు నమోదు చేసారు పోలీసులు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా.. యువతను తప్పుదోవ పట్టించే రీతిలో డర్టీ హరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణ తో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీ ల పై సుమోటో కేసు నమోదు చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు.

ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా ఓ బోల్డ్‌, డర్టీ కథాంశంతో చిత్రాన్ని రూపొందించారు. తాజాగాగా విడుదల చేసిన ఈ పోస్టర్లో హీరో టవల్ చుట్టుకొని.. హీరోయిన్ బెడ్ షీట్ కప్పుకొని హాఫ్ న్యూడ్‌గా ఉంది. ఈ పోస్టర్ వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్ పై అతికించారు. ఈ సినీ పోస్టర్ల పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎంఎస్‌ రాజు దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు.


Next Story