కెప్టెన్ మిల్లర్.. రిలీజ్ డేట్ లాక్ అయింది

ధనుష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కెప్టెన్ మిల్లర్ విడుదల తేదీని లాక్ చేశారు.

By Medi Samrat  Published on  5 Dec 2023 9:45 PM IST
కెప్టెన్ మిల్లర్.. రిలీజ్ డేట్ లాక్ అయింది

ధనుష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కెప్టెన్ మిల్లర్ విడుదల తేదీని లాక్ చేశారు. తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కోలీవుడ్ సినిమాలలో ఈ చిత్రం ఒకటి. విడుదల తేదీపై ఇప్పటికే అనేక చర్చలు జరిగాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న విడుదల చేయాలని భావించారు కానీ పొంగల్ 2024కి వాయిదా పడింది.

ఈ చిత్రం జనవరి 12, 2024న విడుదలవుతుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. కత్రినా కైఫ్‌తో కలిసి విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా కూడా అదే తేదీన విడుదల కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్', శివకార్తికేయన్ 'ఐలాన్' పొంగల్ సీజన్‌కు వస్తోంది. ఇక అదే సమయంలో టాలీవుడ్ లో కూడా భారీ రిలీజ్ లు ఉన్నాయి. కెప్టెన్ మిల్లర్ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్, వినాయకన్, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు

Next Story