నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం

Bunny Vasu Brother Passes Away. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  12 Dec 2020 4:47 AM GMT
నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ అనారోగ్యం కార‌ణంగా మృతిచెందారు. గ‌త కొంత కాలంగా కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో చేరగా.. అక్క‌డ‌ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.

బన్నీ వాసుది పాలకొల్లు. నాన్న‌ గవర సూర్యనారాయణ. మొత్తం ముగ్గురు సంతానం. చిన్న‌వాడైన‌‌ బన్నీ వాసు నిర్మాతగా టాలీవుడ్‌లో స‌క్సెస్ అయ్యాడు. ఇక‌ పెద్దకుమారుడు సురేష్. ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబందించిన ఇంజనీర్‌గా గుర్తింపు పొందాడు. సురేష్‌ మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

ఇదిలావుంటే.. అల్లు అర్జున్‌కు మంచి మిత్రుడైన బ‌న్నీ వాసు.. టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌‌ 100% లవ్ , పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్ చిత్రాల‌‌ను నిర్మించాడు.Next Story
Share it