బిగ్ బాస్ విన్నర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ

Bigg Boss Winner Abijeet Gets A Surprise From Cricketer Rohit Sharma. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కు టీమిండియా

By Medi Samrat  Published on  15 Jan 2021 6:33 AM GMT
బిగ్ బాస్ విన్నర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో గెలిచినందుకు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి అభినందించాడని తెలుస్తోంది. తన జెర్సీపై 'విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్' అని రాసి తన సంతకం చేసి అభిజిత్ కు పంపించాడు. ఈ సందర్భంగా హనుమ విహారికి కూడా అభిజిత్ థ్యాంక్స్ చెప్పాడు. ఆసీస్ టూర్ లో ఉన్న రోహిత్, విహారి మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చ వచ్చింది. ఈ క్రమంలో బిగ్ బాస్ గురించి కూడా చర్చించుకున్నారు. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు రోహిత్ బహుమతి అందించాడు. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా వెల్లడించాడు. తాను ఎంతో అభిమానించే క్రికెటర్ నుంచి తనకు గిఫ్ట్ అందిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.తాను ఎంతగానో అభిమానించే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే... అన్ని పనులను ఆపేసి క్రికెట్ చూస్తూ ఉండిపోతానని అభిజిత్ చెప్పాడు. క్రికెటర్ కావాలనేది చిన్నప్పటి నుంచి తన కోరిక అని.. కానీ అది జరగలేదు. జీవితం మరో కోణంలో పయనించిందని చెప్పాడు. ఇప్పటికీ క్రికెట్ అనేది తనలోని చిన్న పిల్లాడిని బయటకు తీసుకొస్తుందని తెలిపాడు. రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ అతని మూలాలు తెలుగుగడ్డపై ఉన్నాయి. రోహిత్ అమ్మ తెలుగువారే..!


Next Story