అందరూ ఊహించినట్టుగానే టైటిల్ విన్నర్ అయిన కంటెస్టెంట్!

Bigg Boss-4 Winner. బిగ్ బాస్ సీజన్ 4.. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేలో సినీ తారల మధ్య ఎంతో ఆనందంగా

By Medi Samrat  Published on  21 Dec 2020 3:52 AM GMT
అందరూ ఊహించినట్టుగానే టైటిల్ విన్నర్ అయిన కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్ 4.. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేలో సినీ తారల మధ్య ఎంతో ఆనందంగా ఉత్కంఠ భరితంగా ముగిసింది. 19 మందితో మొదలైన ఈ షో ప్రతి వారం ఒకరు చొప్పున ఎలిమినేట్ కాగా, చివరికి ఫైనలిస్ట్‌లుగా అభిజిత్, అఖిల్, సోహెల్, హారిక, అరీయాన ఉన్నారు. ఈ ఐదుగురిలో విజేత ఎవరని ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. అయితే చివరికి అభిజిత్ ఎక్కువ ఓట్లు సాధించడంతో బిగ్ బాస్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి సీజన్‌-4 విజేత అభిజీత్‌కు ట్రోఫీతో ఇచ్చారు.

ఫైనల్ లిస్టులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ లు గెలుపు కోసం ఎవరి సామర్థ్యం కొరకు వారు గట్టిపోటీని ఇచ్చారు. అయితే ఈ ఐదుగురి కంటెస్టెంట్ లో మొదట హారిక హౌస్ నుంచి బయటకు వచ్చారు. తరువాత అరియాన, సోహైల్ బయటకు రావడంతో అఖిల్, అభిజిత్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంలో ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూశారు. అయితే అత్యధిక ఓట్లు సాధించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న అభిజిత్ చివరకు బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.

అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎంతో చాకచక్యంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను ఎంతో తెలివిగా పూర్తి చేయడంతో ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ అభిమానమే అభిజిత్ ను బిగ్ బాస్ విజేతగా నిలబెట్టింది. ఈసారి కూడా బిగ్ బాస్ విజేత అమ్మాయి కాకుండా గత సీజన్ లలో మాదిరి అబ్బాయి గెలవడం విశేషం.


Next Story