బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలెట్స్ ఇవే!

Bigg Boss-4 Grand Finale Highlights. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ టైంలో స్టార్ మా బిగ్ బాస్

By Medi Samrat  Published on  21 Dec 2020 4:02 AM GMT
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలెట్స్ ఇవే!

కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ టైంలో స్టార్ మా బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అయితే ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ బిగ్ బాస్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4.. 19 మంది కంటెస్టెంట్ లతో మొదలై చివరికి ఐదుగురు ఫైనలిస్ట్ గా ఉండి ఒకరు విజేతగా డిసెంబర్ 20న ఎంతో సందడిగా ముగిసింది. ప్రేక్షకులందరూ ముందుగానే ఊహించినట్లే బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలిచాడు.

హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అభిజిత్ ఎంతో తెలివిగా టాస్క్ లను పూర్తి చేస్తూ తన నిజ స్వరూపంతో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను పూర్తిచేస్తూ, ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. మొదటి నుంచి ఓట్ల విషయంలో లీడింగ్ లో ఉన్న అభిజిత్ చివరికి విజేతగా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని మెగాస్టార్ చేతులమీదుగా అందుకున్నారు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో మొదటగా హారిక, అరియాన, సోహైల్ హౌస్ నుంచి బయటికి రావడంతో అఖిల్, అభిజిత్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో చివరికి అభిజిత్ అత్యధిక ఓట్లు సాధించడంతో విజేతగా నిలిచాడు.

బిగ్ బాస్ హైలెట్స్:

*సెప్టెంబర్ 6న మొదలైన బిగ్బాస్ సీజన్ ఫోర్ 105 రోజులపాటు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగి డిసెంబర్ 20న ముగిసింది.

*సూర్య కిరణ్‌, కల్యాణి, దేవి, స్వాతి, గంగవ్వ, సుజాత, దివి, నోయల్‌, అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌, లాస్య, అవినాష్‌, మోనల్‌, హారిక, అరియానా, సోహైల్‌, అఖిల్‌, అభిజీత్‌ మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు బిగ్ బాస్ స్టేజిపై నించున్నారు.

*ఈ కంటెస్టెంట్ లో అందరికంటే యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఎంతో ఆకర్షణగా నిలిచారు. అయితే అనారోగ్యం కారణంగా మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోయారు.

*బిగ్ బాస్ సీజన్ 4 నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే దసరా పండుగ రోజు ప్రత్యేకమైన ఎపిసోడ్ లో సమంత హోస్ట్ గా వచ్చి ఎంతో సందడి చేశారు.

*బిగ్ బాస్ 62వ రోజు సందర్భంగా తమిళ బిగ్ బాస్ హౌస్ మేట్స్, వ్యాఖ్యాత కమల్ హాసన్ వర్చువల్ గా మాట్లాడారు.

*బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వలనే నోయెల్ కూడా అనారోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే బయటకు వెళ్ళాడు. ఆతరవాత ఒకోకరు ఎలిమినేట్ అవుతూ ఫైనలిస్ట్ లుగా హారిక, అరియనా, అభిజీత్, అఖిల్, సోహెల్ నిలిచారు.

*100వ రోజు ప్రత్యేకంగా బిగ్ బాస్ సీజన్ 1 హరితేజ, సీజన్ 2 నుంచి గీతా మాధురి, సీజన్ 3 నుంచి శ్రీముఖి, ఆలీ వచ్చి ఫైనలిస్ట్ లతో ఎంతో సరదాగా గడిపారు.

బిగ్ బాస్ ఫోర్ గ్రాండ్ ఫినాలే హారిక, అరియాన హౌస్ నుంచి వెళ్లిపోయాక నాగార్జున మిగిలిన ముగ్గురికి ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా హౌస్ నుంచి వెళ్లిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇస్తానని ప్రకటించారు. గత సీజన్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ డబ్బులు ఎవరు తీసుకోకుండా ఉన్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం నాగార్జున ఇచ్చిన ఆఫర్ కి సోహెల్ డబ్బులు తీసుకుని స్వచ్ఛందంగా బయటకు వచ్చారు.

హౌస్ లో ఉన్న సోహెల్.. అతను తీసుకున్న డబ్బులో పది లక్షల రూపాయలు స్వచ్చంద సంస్దకు ఇస్తానని చెప్పి బయటకు వచ్చిన సోహెల్.. మెహబూబ్ ని చూసి 5 లక్షల రూపాయిలు ఇస్తా అంటారు. మిగతా10 లక్షలు అనాధ శరణాలయానికి ఇస్తానని ప్రకటించారు. దీంతో వెంటనే మెహబూబ తనకిచ్చిన 5 లక్షలు సైతం అనాధ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. ఇది అంత చుసిన నాగార్జున మీ డబ్బు మీతోనే పెట్టుకోండి.. నా సొంత డబ్బును మీ పేరు మీద పది లక్షల రూపాయలను అనాధ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ వేదికపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఇక ఆతర్వాత చిరంజీవి రావడం.. మంచి కామెడీ చెయ్యడం.. అమ్మాయిలకు కిస్ లు ఇవ్వడం.. మెహబూబ్ కి పది లక్షల రూపాయిలు చెక్ ఇవ్వడం, సోహెల్ సినిమాలో చిన్న రోల్ లో నటిస్తా అని మాట ఇవ్వడమే కాకుండా ఆడియో రిలీజ్ చేస్తా అని మాట ఇచ్చాడు. దివికి కూడా తన సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అవకాశం ఇస్తున్నట్టు లీక్ చేశాడు చిరంజీవి. ఇలా అందరిపై కామెడీలు చేస్తూ.. తనదైన శైలిలో అందరిని ఆకట్టుకున్నాడు మెగాస్టార్. అనంతరం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున విజేతగా అభిజీత్ ని ప్రకటించగా మెగాస్టార్ చిరంజీవి తన చేతులు మీదుగా బిగ్ బాస్ సీజన్ 4 ట్రోఫీ ఇచ్చాడు. ఇలా బిగ్ బాస్ సీజన్ 4 కు తెర పడింది.




Next Story