బిగ్‌బాస్ సీజన్-4 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
Big Boss Season 4. తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 చివరి దశకు చేరుకుంది. నేటితో టాప్-5లో ఉండేదెవరో తేలిపోనుంది.
By Medi Samrat Published on 13 Dec 2020 5:14 PM IST
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 చివరి దశకు చేరుకుంది. నేటితో టాప్-5లో ఉండేదెవరో తేలిపోనుంది. అయితే.. ప్రతివారం ఎలిసోడ్ టెలికాస్ట్‌కు ముందుగానే ఎవరు వెళ్లిపోతున్నారనే విషయాన్ని లీకువీరులు ముందుగానే చెప్పేస్తున్నారు. చాలా వరకు అవి నిజం అవుతున్నాయి కూడా. అయితే.. ఈ సారి బిగ్‌బాస్ దత్తపుత్రికగా పేరు సంపాదించుకున్న మోనాల్ ఎలిమినేషన్ కానుందని లీకు వీరులు చెప్పేశారు.
ఫైనల్‌కు ఇంకో వారమే మిగిలింది. ఈ నేపధ్యంలో ఈ వారం జరగబోయేది చివరి ఎలిమినేషన్. హౌస్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఒకడైన అఖిల్ టికెట్ టు ఫినాలే గెల్చుకుని సేవ్ అయ్యాడు. కాగా మోనాల్, సోహైల్, అరియానా, అభిజిత్, హారిక లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. నామినేషన్ లో ఉన్న వారిలో మోనాల్ బలహీనంగా ఉందని తెలుస్తోంది.
ఇక ఆమె నామినేషన్ లో ఉన్న ప్రతి సారి ఎలిమినేట్ అయిపోతుందని ప్రేక్షకులు భావిస్తూ వచ్చారు. మీడియా వర్గాలు కూడా ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ చెబుతూ వచ్చాయి. కాని బిగ్ బాస్ లో ఏం జరిగిందో మోనాల్ ఏం మాయ చేస్తూ వచ్చిందో కాని సేవ్ అవుతూ వచ్చింది. ఆమె అంత బలహీనమైన కంటెస్టెంట్ అయినా కూడా 14వ వారం వరకు కొనసాగుతూ వచ్చింది. దేవి, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, అవినాష్, కుమార్ సాయి వంటి వారు నూటికి నూరు శాతం ఆమె కంటే ఖచ్చితంగా స్ట్రాంగ్. అయినా కూడా ఆమె వల్ల ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ ఆమెను కటిన్యూ చేస్తూ వచ్చాడని చాలా మంది చేసిన విమర్శ. ఎట్టకేలకు చివరి వారంకు ముందు ఆమె ఎలిమినేట్ అయ్యింది. నిజంగానే మోనాల్ వెళ్లి పోయిందా అనేది నేటి ఎపిసోడ్‌లో క్లారిటీ రానుంది.