బిగ్ బాస్ ఫినాలే: మరోసారి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్?
Big Boss-4 Grand Finale Cheif Quest. స్టార్ మాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాల్టీ షో మరో
By Medi Samrat Published on 18 Dec 2020 1:55 PM ISTస్టార్ మాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాల్టీ షో మరో మూడు రోజులలో ముగుస్తుంది. 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమై బిగ్ బాస్ సీజన్ ఫోర్ విజేతగా నిలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు కేవలం ఐదుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. అందులో అభిజిత్, సోహైల్, అరియాన, హారిక, అఖిల్ ఉన్నారు. హౌస్ లో ఉన్న ఈ కంటెస్టెంట్ లలో విజేతలుగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది
డిసెంబర్ 20న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫినాలేను గత సీజన్ లలో కంటే ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని బిగ్ బాస్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ గ్రాండ్ ఫినాలేలో సందడి చేయడానికి లక్ష్మీ రాయ్, మెహరీన్ వంటి హీరోయిన్లు కూడా వస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇదివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు సైతం ఈ గ్రాండ్ ఫినాలేలో సందడి చేయనున్నారు.
బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా నిర్వహించి విజేతగా శివ బాలాజీను ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. సీజన్ 2 లోనాని వ్యాఖ్యాతగా నిర్వహించగా ప్రత్యేక అతిథిగా విక్టరీ వెంకటేష్ పాల్గొని కౌశల్ ను విజేతగా ప్రకటించారు. సీజన్ 3 నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే విజేతను ప్రకటించడం కోసం సీజన్ త్రీ లో మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. ప్రస్తుతం సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ గా మొదట ఎన్టీఆర్ వస్తున్నారని సమాచారం జోరుగా సాగింది. అయితే దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
డిసెంబర్ 20న జరగబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించడానికి మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు బిగ్ బాస్ వేదికపైకి రానున్నారని తెలిపారు. అయితే సీజన్ ఫోర్ లో మెగాస్టార్ చేతులమీదుగా బిగ్ బాస్ ట్రోఫీని అందుకనే లక్కీ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందేనని చెప్పవచ్చు.