హిందీలో గర్జించడానికి సిద్ధ‌మైన 'భీమ్లా నాయక్'

Bheemla Nayak Hindi Trailer. టాలీవుడ్ అగ్ర నటులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి.. భీమ్లా నాయక్ సినిమాతో తమ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో

By Medi Samrat  Published on  4 March 2022 2:16 PM IST
హిందీలో గర్జించడానికి సిద్ధ‌మైన భీమ్లా నాయక్
టాలీవుడ్ అగ్ర నటులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి.. భీమ్లా నాయక్ సినిమాతో తమ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో బిగ్ స్క్రీన్‌లపై గర్జించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గత నెలలో విడుదలైనప్పటికీ థియేటర్లలో ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో డబ్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ట్రీట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేర‌కు మేకర్స్ హిందీ ట్రైలర్‌ను విడుద‌ల చేయ‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. "తెలుగులో గర్జించిన విజయం తర్వాత, హిందీలో పవర్ స్టార్మ్ టేకోవర్ చేయడానికి సిద్ధమ‌వుతున్నారు అంటూ ట్వీట్ చేసింది చిత్ర‌యూనిట్‌.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్‌తో ప్రారంభమయింది. ప‌వ‌న్‌.. రానా గ్యాంగ్‌ను కొట్టడం, అతనితో యుద్ధం మొద‌లెట్ట‌డం కనిపిస్తుంది. రానా కూడా పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కొంటున్న సన్నివేశాలు ట్రైలర్‌లో చూడొచ్చు. ఇద్దరి నటన పోటాపోటీగా ఉంటుంది. పవన్ భార్య పాత్రలో నటించిన నిత్యా మీనన్ కూడా క్లాస్‌గా కనిపించింది. ఈ సినిమాకు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే అందించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. సంయుక్త మీనన్ మ‌రో క‌థానాయిక‌గా న‌టించింది.



Next Story