బీస్ట్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

'Beast' OTT Release Date. ఇళయ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన

By Medi Samrat  Published on  10 May 2022 9:00 PM IST
బీస్ట్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం బీస్ట్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్‌ 13న తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. తమిళంలో మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. అది కూడా హీరో విజయ్ కారణంగానే సినిమాకు వెళ్లారు అభిమానులు. ఆ తర్వాతి రోజే కేజీఎఫ్ కూడా విడుదలవ్వడం ఈ సినిమాకు కాస్త నెగటివ్ గా మారింది.

ఓ షాపింగ్‌ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్‌ చేస్తే, అందులో ఉన్న ప్రజలను రా ఏజెంట్‌ ఎలా రక్షించాడన్న ఆసక్తికర కథాంశంతో బీస్ట్‌ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం కుదిరింది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన స‌న్ ఎన్ఎక్స్‌టీ (Sun NXT), నెట్‌ఫ్లిక్స్‌లలో ఈరోజు అర్ధరాత్రి 12గంట‌ల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు కన్నడ, తెలుగు, మలయాళ వెర్షన్లు అన్ని ఒకేసారి సన్ నెక్ట్‌లో ప్రసారం కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ బీస్ట్ మే 11, 2022న డిజిటల్ స్క్రీన్‌లలోకి వస్తుందని.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీతో సహా నాలుగు భాషలలో సినిమా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో సెల్వరాఘవన్, రెడిన్ కింగ్స్లీ, జోర్న్ సుర్రావ్, వీటీవీ గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రలు పోషించారు.













Next Story