బండ్లన్నా.. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా..!

Bandla Ganesh Did Hair Cutting For His Dad. బండ్ల గణేష్ ఈ పేరు వింటే చాలు మెగా అభిమానుల్లో చిరునవ్వు. ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడే

By Medi Samrat  Published on  8 May 2021 12:49 PM GMT
బండ్లన్నా.. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా..!

బండ్ల గణేష్ ఈ పేరు వింటే చాలు మెగా అభిమానుల్లో చిరునవ్వు. ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడే మాటలకు ఎంతో మంది ఫిదా అయిన సంగతి తెలిసిందే..! ఇక నిర్మాతగా, నటుడిగా కూడా తనదైన శైలిలో రాణిస్తూ ఉన్నాడు బండ్ల గణేష్. తాను మంచి కొడుకును కూడా అని ఆయన తాజాగా రుజువు చేసుకున్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఎంతగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. ఇంకొందరు బయటకు వెళ్ళాలి అంటే చాలు జంకుతూ ఉన్నారు. పెద్ద వాళ్ళను బయటకు పంపించకుండా ఉండాలని వైద్యులు.. నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో సెలూన్ కూడా ఒకటి. ఇంటికే వచ్చి కటింగ్, షేవ్ చేసే సదుపాయాలు ఉన్న యాప్స్ ఉన్నాయనుకోండి. అది వేరే విషయం.

తాజాగా బండ్ల గణేష్ తన తండ్రిని బయటకు పంపించలేక తానే తండ్రికి కటింగ్ చేయడం విశేషం. 'కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను' అని వీడియోను అప్లోడ్ చేశాడు బండ్ల గణేష్. ట్రిమ్మర్ సహాయంతో బండ్ల గణేష్ తన తండ్రికి కటింగ్ చేస్తున్న వీడియోను చూడొచ్చు. తండ్రి మీద బండ్ల గణేష్ చూపించిన ప్రేమకు చాలా మంది ఫిదా అవుతూ ఉన్నారు. ఇక బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకున్నారు.Next Story