వ‌క్క‌పొడి కూడా వేసుకోను.. అమ్మ‌తోడు నాకేం తెలియ‌దు..!

Bandla Ganesh Comments On Drugs Case. నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

By Medi Samrat  Published on  31 Aug 2021 8:32 PM IST
వ‌క్క‌పొడి కూడా వేసుకోను.. అమ్మ‌తోడు నాకేం తెలియ‌దు..!

నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ఈ ఉద‌యం ప్రారంభమైంది. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలిరోజు డైరెక్ట‌ర్‌ పూరీ జగన్నాథ్ ఉద‌యం విచారణకు వచ్చారు. పూరీ జగన్నాథ్‌తో పాటు ఆయన అకౌంటెంట్‌ శ్రీధర్‌ని ఈడీ అధికారులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. దాదాపు తొమ్మిది గంటలకుపైగా ఈ విచారణ కొనసాగుతోంది.

ఇదిలావుంటే.. ఈడీ కార్యాల‌యం ముందు నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ స‌డెన్‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. పూరీ జగన్నాథ్ ను ఈడీ.. ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్న సమయంలో గ‌ణేష్ పేరును ప్ర‌స్తావించ‌డం వ‌ల్ల అధికారులు ఆయ‌న‌ను పిలిచారా.. ఏదైనా ఇత‌ర కార‌ణంతో వ‌చ్చారా అన్న‌ది తెలియాల్సివుంది. ఇక ఈడీ కార్యాలయానికి వచ్చిన గణేశ్ ను నోటీసుల విష‌య‌మై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. నేను వ‌క్క‌పొడి కూడా వేసుకోను.. నాకు ఎందుకు వ‌స్తాయి నోటీసులు అని అన్నారు. విచార‌ణ‌కు ఉద‌యం వ‌చ్చారు.. టెన్ష‌న్‌గా ఉండి పూరీ జగన్ అన్న‌ను కలవడానికి వచ్చాను.. అమ్మ‌తోడు నాకేం తెలియ‌దని గ‌ణేష్ అన్నారు.



Next Story