ట్విట్టర్‌కు గుడ్ బై చెప్తాను.. అందుకే..

Bandla Ganesh About Twitter. సినీ నిర్మాత, హ‌స్య‌న‌టుడు బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు షాక్ ఇవ్వ‌బోతున్నారు. త్వ‌ర‌లో ట్విట్టర్‌కు

By Medi Samrat  Published on  14 Aug 2021 5:04 PM IST
ట్విట్టర్‌కు గుడ్ బై చెప్తాను.. అందుకే..

సినీ నిర్మాత, హ‌స్య‌న‌టుడు బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు షాక్ ఇవ్వ‌బోతున్నారు. త్వ‌ర‌లో ట్విట్టర్‌కు స్వస్తి చెబుతానంటు ట్వీట్ చేశారు. వివాదాలు వద్దు.. జీవితంలో వివాదాలకు చోటు ఉండకూడదని కోరుకుంటున్నాన‌ని స‌ద‌రు ట్వీట్‌లో పేర్కొన్నారు. తరచూ వినోదభరిత ట్వీట్లు, స్పీచ్‌లతో అలరించే బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు ఎందుకు గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

ఇదిలావుంటే.. తాజాగా బండ్ల గణేష్ వేసిన ఓ ట్వీట్ కాంట్రవర్సీకి దారి తీసింది. అది కాస్తా మహేష్ బాబు అభిమానులు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. అసలు జరిగిన మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం. పవన్ కళ్యాణ్, రానా మూవీకి సంబంధించిన అప్డేట్ చెబుతూ నిన్న ఒక పోస్టర్‌ను చిత్రయూనిట్ వదిలింది. ఆగస్ట్ 15న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ వదలబోతోన్నామంటూ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ స్టిల్‌ను షేర్ చేశారు.

ఆ స్టిల్ ను షేర్ చేస్తూ బండ్ల గ‌ణేష్‌.. దేవర దెబ్బ బాబుల్ గాడి అబ్బా అని ట్వీట్ వేశారు. అయితే.. ఈ ట్వీట్‌లో కొంత‌మంది పవన్ కళ్యాణ్ మీదున్న ప్రేమను చూస్తే.. ఇంకొందరు మహేష్ బాబు మీదే సెటైర్ వేశారని అనుకుంటున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ బండ్ల గణేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పాల‌ని అనుకుంటున్నారేమో అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.


Next Story