'భలేగా తగిలావే బంగారం'.. వైరల్
Balega Thagilavey Bangaram Song Released. మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
By Medi Samrat
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూరైంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు మాస్ రాజా. రవితేజ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన క్రాక్ ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి 'భలేగా తగిలావే బంగారం..' అంటూ సాగే సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పాడటం విశేషం. పూర్తి పాటను రేపు ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు. ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిపి పాటకు పని చేయడంతో పాట కూడా అంతే అద్భుతంగా వచ్చింది. పూర్తి పాట విడుదలైతే దుమ్మురేపడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాని నిర్మాతలు భావిస్తున్నారు.