బాలయ్య దూకుడు.. మరో సినిమాకు రేపే ముహూర్తం

Balakrishna Next Movie Pooja Ceremony. నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూకుడు మీద ఉన్నారు.

By Medi Samrat  Published on  7 Dec 2022 9:15 PM IST
బాలయ్య దూకుడు.. మరో సినిమాకు రేపే ముహూర్తం

నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూకుడు మీద ఉన్నారు. అఖండ భారీ హిట్ ను తన తర్వాతి సినిమా 'వీరసింహా రెడ్డి' తో కంటిన్యూ చేసేలా ఉన్నారు. ఇక ఆ సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమా కూడా పట్టాలెక్కనుంది. 108వ సినిమాకు సంబంధించి ముహూర్తం ఈ గురువారం నాడే..! సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగు లాంచ్ కి ముహూర్తాన్ని ఖాయం చేసినట్టుగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. హైదరాబాదులో రేపు ఉదయం 9:36 నిమిషాలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల చేయనుండగా, ఆయన సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ పేరు వినిపిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎఫ్ 3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పడమే కాకుండా.. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను అభిమానులతో పంచుకున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. తర్వాతి సినిమాను వైవిధ్యంగా తీస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' సినిమా చేస్తున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 107వ సినిమా. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే వీరసింహా రెడ్డి చుట్టూ భారీ బజ్ నెలకొంది.


Next Story