మా ఎన్నికలపై బాలయ్య కామెంట్లు విన్నారా..
Balakrishna Comments On MAA Elections. మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 15 July 2021 6:43 PM IST
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు రెండు మూడు బృందాలుగా విడిపోయారు. మరో వైపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నందమూరి బాలకృష్ణ మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకల్ , నాన్ లోకల్ అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోనని తేల్చి పడేశారు.
మా సంస్థ కోసం ఇంతవరకు బిల్డింగ్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని.. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని, పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు బల్డింగ్ కోసం ఓ ఎకరం భూమి సాధించలేరా? అని ప్రశ్నించారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని కూడా ప్రశ్నించారు. ఇండస్ట్రీ పెద్దలంతా బిల్డింగ్ కోసం పాటుపడాలని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
తామే సొంతంగా 'మా' బిల్డింగ్ నిర్మాణం చేపడతామన్న మంచు విష్ణు వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ విష్ణు ముందుకొస్తే తాను కూడా ఇందుకు సహకరిస్తానని అన్నారు. అందరం కలిసి నిర్మిస్తే ఇంద్రభవనమే నిర్మించవచ్చని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఎన్నో విషయాల్లో ముక్కు సూటిగా మాట్లాడే నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో కూడా తేల్చేశారు.