ఓటీటీలో వచ్చేస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం

Ashoka Vanam Lo Arjuna Kalyanam OTT Release Date and Time. యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి హిట్ ను

By Medi Samrat  Published on  27 May 2022 7:11 PM IST
ఓటీటీలో వచ్చేస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం

యంగ్ హీరో విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే..! ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రాన్ని మే 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ యాక్టింగ్.. క్లాస్ లుక్ లో సినిమా ముందుకు సాగడం.. పాటలు కూడా చాలా హిట్ అవ్వడంతో విశ్వక్ సేన్ మరో హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాకు ముందు ఓ టీవీ ఛానల్ తో చోటు చేసుకున్న వివాదం కూడా సినిమాకు మంచి పబ్లిసిటీని తెప్పించింది.

ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ''ఆకాశ వనంలో అర్జున కళ్యాణం'' సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' వీడియోలో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను తాజాగా ఆహా వీడియో రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా రుక్సార్ డిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. ఓటీటీలో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా కలెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతోంది.







Next Story