ఏఆర్‌ రెహమాన్ ఇంట్లో విషాదం

AR Rahman's mother Kareema Begum passes away. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 28 Dec 2020 2:30 PM IST

ఏఆర్‌ రెహమాన్ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సోమ‌వారం ఆయ‌న త‌ల్లీ క‌రీమా బేగం క‌న్నుమూశారు. రెహామాన్ త‌న త‌ల్లి చిత్రాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి వార్త‌ల‌ను ధృవీక‌రించారు. క‌రీమా బేగం అనారోగ్యంతో చ‌నిపోయిన‌ట్లు చెబుతున్నారు.



కాగా కరీమా బేగానికి నలుగురు సంతానం. వీరిలో ఏఆర్‌ రెహమాన్‌ చిన్నవాడు. కరీమా భర్త ఆర్‌కే శేఖర్..‌ రెహమాన్‌ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే మరణించారు. త‌న త‌ల్లి అంటే రెహ‌మాన్‌కు చాలా ఇష్టం. ఆమెతో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డేవాడు. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో సైతం తన త‌ల్లి ప‌ట్ల ఉండే ఇష్టాన్ని రెహ‌మాన్ తెలిపాడు. త‌నకు ఇంత పేరు ప్ర‌ఖ్యాతులు రావ‌డానికి కార‌ణం తన త‌ల్లినే కార‌ణం అని రెహ‌మాన్ ఓ సంద‌ర్భంలో చెప్పాడు. విష‌యం తెలిసిన అభిమానులు, ప్ర‌ముఖులు ఆమె‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


Next Story