సర్కారు వారి పాట సినిమా.. నేను ఉన్నాను.. నేను విన్నాను.. అనేసిన ఏపీ ప్రభుత్వం

AP govt permits price hike of tickets for ‘Sarkaru Vaari Paata’. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By Medi Samrat  Published on  7 May 2022 4:30 PM IST
సర్కారు వారి పాట సినిమా.. నేను ఉన్నాను.. నేను విన్నాను.. అనేసిన ఏపీ ప్రభుత్వం

సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు రూ.45 మేర పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం (మే 6) రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కొన్ని సినిమాల టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట మేకర్స్ విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చింది. ఇటీవల విడుదల చేసిన 'సర్కారు వారి పాట' సినిమా ట్రైలర్ లో 'నేను విన్నాను నేను ఉన్నాను' అనే డైలాగ్‌ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే..! ఈ డైలాగ్ వైసీపీ ప్రభుత్వానికి ఎంతో ఇష్టమైనదని పలువురు పోస్టులు కూడా పెట్టారు. సర్కారు వారి పాట సినిమా విషయానికొస్తే... మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 7న హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రం థియేటర్లలో చూసి మీ స్పందన తెలియజేయగలరు అంటూ మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు, మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. 'ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి' అంటూ మహేశ్ తన లేఖలో చెప్పుకొచ్చారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై 'సర్కారు వారి పాట' చిత్రం తెరకెక్కింది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపి నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు.












Next Story