అనుష్క.. ఎట్టకేలకు అక్క‌డ మెరిసింది..!

Anushka Shetty attends RRR success party. అనుష్క శెట్టికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. కానీ అనుష్క పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు

By Medi Samrat  Published on  28 March 2022 12:33 PM IST
అనుష్క.. ఎట్టకేలకు అక్క‌డ మెరిసింది..!

అనుష్క శెట్టికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. కానీ అనుష్క పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు.. అలాగే ఫంక్షన్స్ లో కనిపించడం కూడా చాలా అరుదు. తాజాగా అనుష్క శెట్టి కనిపించింది. అయితే అది ఏదైనా ఈవెంట్ లో కాదు.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో..!. SS రాజమౌళి RRR ప్రధాన తారాగణం, సిబ్బందికి పార్టీని ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీకి రామ్ చరణ్, ఉపాసన, ఎస్ఎస్ రాజమౌళి, ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అనుష్క శెట్టినే.. చాలా కాలం తర్వాత RRR టీమ్ సక్సెస్ పార్టీలో కనిపించింది అనుష్క శెట్టి.

ఆమె చాలా సింపుల్‌గా, క్యూట్‌గా కనిపించింది. అనుష్క శెట్టి క్యాజువల్ కాటన్ కుర్తా ధరించి కనిపించింది. ఆమె RRR సిబ్బందితో సరదాగా గడిపినట్లు కనిపించింది. సక్సెస్ పార్టీ నుండి వచ్చిన ఫోటోలలో RRR డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఇతర సిబ్బందిని సూపర్ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. SS రాజమౌళి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం RRR భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అద్భుతంగా రాణిస్తోంది. దీని హిందీ వెర్షన్ మొదటి రోజున రూ. 18 కోట్లు వసూలు చేసింది, రెండో రోజు రూ. 23-23.50 కోట్లు సంపాదించడం విశేషం. అనుష్క చివరి సారిగా 'నిశ్శబ్దం' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. అప్పటి నుంచి ఆమె కొత్త చిత్రం రాలేదు.










Next Story