నటి మాధవి హఠాన్మరణం.. సంతాపం వ్యక్తం చేస్తున్న చిత్ర పరిశ్రమ

Anupamaa actor Madhavi Gogate dies at 58 due to Covid-19. నటి మాధవి గోగటే ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం

By Medi Samrat  Published on  22 Nov 2021 5:54 PM IST
నటి మాధవి హఠాన్మరణం.. సంతాపం వ్యక్తం చేస్తున్న చిత్ర పరిశ్రమ

నటి మాధవి గోగటే ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆమెకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆసుపత్రిలో ఆమె కోవిడ్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. నవంబర్ 21 మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచింది. నటి మాధవి గోగటే సహనటి రూపాలీ గంగూలీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె మరణంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.

ప్రముఖ సోప్ ఒపెరా అనుపమలో కాంత జోషి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మాధవి గోగటే. ఈ షోలో ప్రధాన పాత్రధారి అనుపమ తల్లి పాత్రలో మాధవి గోగటే నటించారు. మాధవి గోగటే కోయి అప్నా సా, కహిన్ తో హోగా, ఐసా కభీ సోచా నా థా మొదలైన ఇతర టీవీ షోలలో చేసారు. ఆమె ఇటీవల 'తుజా మజా జామ్‌టే' తో మరాఠీ టీవీలో అరంగేట్రం చేసింది. ఆమె అశోక్ సరాఫ్‌తో మరాఠీ చిత్రం ఘన్ చక్కర్‌లో కూడా కనిపించింది. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Next Story