ఆ సినిమాలో అనుపమ పర్ఫామెన్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అంటా.!

Anupama parameswaran latest news. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌.. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రౌడీ బాయ్స్‌' సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అనుపమ హద్దు

By అంజి  Published on  30 Oct 2021 9:56 AM GMT
ఆ సినిమాలో అనుపమ పర్ఫామెన్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అంటా.!

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌.. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రౌడీ బాయ్స్‌' సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అనుపమ హద్దు మీరనుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. 'రౌడీ బాయ్స్‌' సినిమాలో లిప్‌లాక్‌లో అనుపమ అందరినీ ఆశ్చర్యపర్చనుందట. బెడ్‌రూమ్‌ సీన్లలోనూ రొమాన్స్‌ రెచ్చిపోనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో దిల్‌ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్‌ హీరోగా నటిస్తున్నాడు. కొత్త హీరో ఆశిష్‌తో అనుపమ రెచ్చిపోనుందని టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా తర్వాత అనుపమ ఇమేజ్‌ టోటల్‌ మారిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా కావడంతో ఘాటు సన్నివేశాలు తక్కువేమి ఉండవని అందరూ అనుకుంటున్నారు. 'రౌడీ బాయ్స్‌' సినిమాను హుషారు ఫేమ్‌ డైరెక్టర్‌ శ్రీహర్ష కొంగువంటి డైరెక్ట్‌ చేస్తున్నాడు. ప్రేమమ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన అనుపమ.. ఇప్పటి వరకు కనిపించిన అన్ని సినిమాల్లోనూ ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించింది. లిప్‌లాక్‌, రొమాన్స్‌, పొట్టి దుస్తులు ధరించేందుకు దూరంగా ఉండేది. ఇటీవల కాలంలో ఈ అమ్మడుకు అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. ఆఫర్స్‌ రాబట్టుకునేందుకే 'రౌడీ బాయ్స్‌' సినిమాలో ఘాటు సన్నివేశాల్లో నటించేందుకు ఒప్పుకుందని టాక్‌ వినిపిస్తోంది.

Next Story
Share it