వావ్ 'వల్లి'గా రష్మిక

Another Update From Pushpa Movie. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'.

By Medi Samrat  Published on  29 Sep 2021 5:09 AM GMT
వావ్ వల్లిగా రష్మిక

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటిస్తున్న రష్మిక మందాన లుక్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. రష్మిక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తుంది. శ్రీవల్లి పాత్రలో కనిపిస్తుంది. అందంగా అలంకరించుకుంటూ కుర్చున్న రష్మిక ఫోటోను విడుదల చేశారు. శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగింది అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో అనసూయ, మళయాలం నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా ప్రకటించింది.

ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది పుష్ప టీమ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండగా..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Next Story
Share it