పుష్ప ఫైట్ వీడియో కూడా లీక్..!

Another Leaked Video Out From Pushpa Movie. ఇటీవలి కాలంలో టాలీవుడ్ కు లీకుల తలనొప్పి పట్టుకుంది. 'పుష్ప' మూవీ నుంచి

By Medi Samrat  Published on  16 Aug 2021 11:46 AM IST
పుష్ప ఫైట్ వీడియో కూడా లీక్..!

ఇటీవలి కాలంలో టాలీవుడ్ కు లీకుల తలనొప్పి పట్టుకుంది. 'పుష్ప' మూవీ నుంచి కొన్ని పిక్స్, పాట ముందే బయటకు రావడంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. చిత్ర యూనిట్ లీకులపై ఫిర్యాదు చేసిన తక్కువ సమయంలోనే 'పుష్ప' మూవీ నుంచి మరో వీడియో లీకైంది. అల్లు అర్జున్ ఫైటింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

భుజంపై కుర్చీని పట్టుకుని లుంగీ కట్టుకోవడం వంటి సీన్స్ ను లీక్ చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు రిపోర్టులు కొడుతుండగా.. చాలా మంది మాత్రం భారీ స్థాయిలో షేర్లు చేస్తున్నారు. ఎడిటింగ్ రూమ్ లో ఉన్న సమయంలో వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా చిత్ర యూనిట్ పనే అయ్యింటుందని భావిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఫైట్ చేస్తుండగా రీసౌండ్లు వస్తున్నాయి. ఇలా మూవీ యూనిట్ నుంచి లీకులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుండడంతో ముందు ఇంటి దొంగలనే పట్టుకోవాలని నిర్మాతలకు అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు.

పుష్ప సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ఇప్పటికే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ లుక్ తో కనిపిస్తూ మాస్ కు కేరాఫ్ పాత్రను చేస్తూ ఉన్నాడు. పుష్పరాజ్ లోని మాస్ కు ఇప్పటికే కనెక్ట్ అయిపోయారు. డిసెంబర్ 25న సినిమా విడుదల అవ్వనుంది. అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక నటిస్తోంది.



Next Story