ఓ కీలక విషయాన్ని బయటపెట్టిన సుమ కనకాల

Anchor Suma About Her Skin Allergy. సుమ కనకాల.. ఓ వైపు ప్రీరిలీజ్ ఈవెంట్లు, టీవీ షోలతో సందడి చేస్తూనే.. తన యూట్యూబ్

By M.S.R  Published on  9 Oct 2021 10:38 AM GMT
ఓ కీలక విషయాన్ని బయటపెట్టిన సుమ కనకాల

సుమ కనకాల.. ఓ వైపు ప్రీరిలీజ్ ఈవెంట్లు, టీవీ షోలతో సందడి చేస్తూనే.. తన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆసక్తికరమైన విషయాలను చెబుతూ వెళుతోంది. తాజాగా ఆమె తనకు సంబంధించిన ఓ విషయాన్ని బయట పెట్టారు. చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చానని.. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదని సుమ చెప్పుకొచ్చారు. నేను కీలాయిడ్‌ టెండెన్సీ అనే స్కిన్‌ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నానని చెప్పేశారు. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది.. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట అంటూ వివరించారు.

దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను.. కానీ ఫలితం లేదని ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైందని చెప్పారు. మేకప్‌ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి ఒకప్పుడు తెలియక జరగాల్సిన డ్యామేజ్‌ జరిపోయిందని సుమ వెల్లడించారు. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం.. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలని.. అప్పుడే మనం సంతోషంగా ఉండగలమని తెలిపారు.Next Story
Share it