గర్భవతిగా అనసూయ.. పోస్ట‌ర్ వైర‌ల్‌

Anasuya Bharadwaj with Baby bump. తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన‌సూయ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓ వైపు యాంక‌ర్‌గా

By Medi Samrat
Published on : 28 Nov 2020 7:01 PM IST

గర్భవతిగా అనసూయ.. పోస్ట‌ర్ వైర‌ల్‌

తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన‌సూయ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓ వైపు యాంక‌ర్‌గా చేస్తూనే వెండితెర‌పై మంచి పేరు తెచ్చుకుంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే అనసూయకు మళ్లీ ఆ స్థాయి పాత్ర పడలేదు. మధ్యలో మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో నటించింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు.

అనసూయ భరద్వాజ్ - అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. నూతన దర్శకుడు రమేష్ రాపర్తి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే రానా దగ్గుబాటి ఆవిష్కరించిన టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో 'థ్యాంక్ యు బ్రదర్' టీమ్ ఇప్పుడు క్యాస్ట్ రివీల్ పోస్టర్ తో ముందుకొచ్చింది. ఈ పోస్టర్ ను టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో ఒక లిఫ్ట్ లో ప్రధాన పాత్రధారి అనసూయ భరద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్ లో చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకొని కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంటే.. ఆమె వెనకే మరో పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్ లో నిలబడి కనిపిస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు నిల్చొని పరస్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉన్నట్లు అనిపిస్తోంది.



ఈ పోస్టర్‌ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు. " ప్రియ, అభిలను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అసలు ఇదంతా ఏంటో అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది. రమేష్‌కు ఆల్ ది బెస్ట్. మీకు విజయం చేకూరాలి. మీ కష్టపడే తత్త్వానికి విజయం కచ్చితంగా వస్తుందని "సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.


Next Story