అనసూయ.. మరోసారి 'ఆంటీ' వివాదంపై స్పందించింది

Anasuya Bharadwaj. అనసూయ.. బుల్లితెర మీద మొదట సందడి చేసి, ఇప్పుడు పలు భాషల్లో సినిమాల్లో

By Medi Samrat
Published on : 2 April 2023 5:14 PM IST

అనసూయ.. మరోసారి ఆంటీ వివాదంపై స్పందించింది

Anasuya Bharadwaj


అనసూయ.. బుల్లితెర మీద మొదట సందడి చేసి, ఇప్పుడు పలు భాషల్లో సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్నారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆమె బుల్లితెరకు కూడా దూరమయ్యారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ గతంలో పలు సందర్భాల్లో అభిమానులతో గొడవలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆంటీ అనే పదం తనకు నచ్చదని, అలా పిలవకండి అని చెప్పడం అప్పట్లో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది.

ఇన్స్ స్టాగ్రామ్ లో తాజాగా ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. ఈ చాట్ లో ఒకరు "అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది" అని ప్రశ్నించారు. దానికి అనసూయ స్పందిస్తూ.. ఎందుకంటే ఆంటీ అనే పదానికి అర్హతలు వేరే ఉంటాయి కాబట్టి. ఎనీ వే.. ఇప్పుడు అంత కోపం రావట్లేదు. అది వాళ్ల కర్మకే వదిలేస్తున్నా..." అంటూ రిప్లై ఇచ్చింది.


Next Story