మంచి ఓపెనింగ్స్ సాధించిన ఆనంద్ దేవరకొండ 'బేబీ'

Anand Devarakonda's 'Baby' got good openings. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల బేబీ చిత్రం విడుదలైంది. మొదటి రోజు సినిమాకు భారీ సంఖ్యలో వెళ్లారు.

By Medi Samrat  Published on  15 July 2023 3:57 PM IST
మంచి ఓపెనింగ్స్ సాధించిన ఆనంద్ దేవరకొండ బేబీ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల బేబీ చిత్రం విడుదలైంది. మొదటి రోజు సినిమాకు భారీ సంఖ్యలో వెళ్లారు. యూత్ ఫుల్ సబ్జెక్ట్ కావడంతో బాగా వెళ్లారు జనం. సినిమా బడ్జెట్ బట్టి మంచి ఓపెనింగ్స్ సాధించిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. బేబీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా రిపోర్ట్ ఇక్కడ ఉంది.

నైజాంలో ఈ చిత్రం మొదటి రోజు 2.37 కోట్ల వసూళ్లు చేసింది. వైజాగ్ లో కలెక్షన్స్ 0.8 కోట్లు, ఈస్ట్ గోదావరి కలెక్షన్స్ 0.41 కోట్లు, వెస్ట్ గోదావరి 0.22 కోట్లుగా ఉన్నాయి. కృష్ణా రీజియన్‌లో కలెక్షన్ల విషయానికి వస్తే 0.35 కోట్లు. గుంటూరు 0.29 కోట్లు, నెల్లూరు 0.18 కోట్లు. సీడెడ్ కలెక్షన్స్ 0.54 కోట్లు అని సమాచారం. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలెక్షన్స్ 0.2 కోట్లు. ఓవర్సీస్ కలెక్షన్స్ 1.7 కోట్లు. టోటల్ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ 7.1 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మీడియం బడ్జెట్ సినిమాకు ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం వారాంతంలో మంచి వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు. జూలై 21 వరకు మరో సినిమా పోటీ లేకపోవడంతో కాసుల వర్షం కురిపించే సినిమాగా బేబీ నిలవనుంది.


Next Story