ఏడ్చేసిన అమితాబ్

Amitabh Bachchan in Tears. తనకు సినిమాలు రాకపోవడంతో 2000లో కౌన్ బనేగా కరోడ్‌పతి హోస్ట్‌గా నిర్ణయం తీసుకున్నట్లు

By Medi Samrat  Published on  4 Dec 2021 6:08 PM IST
ఏడ్చేసిన అమితాబ్

తనకు సినిమాలు రాకపోవడంతో 2000లో కౌన్ బనేగా కరోడ్‌పతి హోస్ట్‌గా నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ షేర్ చేసిన కొత్త ప్రోమోలో ఈ షో 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేయడంతో అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ ఎలా ఫీల్ అయ్యారని అడిగారు. ఎపిసోడ్‌లో శ్వేత, ఆమె కూతురు నవ్య నవేలి నంద అతిథిగా కనిపించారు. శ్వేతాకు సమాధానంగా అమితాబ్ బచ్చన్ "ఈ షో వచ్చి 21 సంవత్సరాలు. ఈ షో 2000లో ప్రారంభమైంది. ఆ సమయంలో నా దగ్గర ఏదీ లేదు. పెద్ద స్క్రీన్ నుండి చిన్న స్క్రీన్‌కి మారడం నా ఇమేజ్‌కి హాని కలిగిస్తుందని ప్రజలు నన్ను హెచ్చరించారు." అని తెలిపారు.

ఆ సమయంలో నాకు సినిమాల్లో ఎలాంటి పని లభించలేదు, కానీ షో ప్రీమియర్ అయిన తర్వాత, దానికి వచ్చిన స్పందన వల్ల ప్రపంచం నా కోసం మారిపోయిందని నేను నమ్ముతున్నాను అని తెలిపారు. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక కంటెస్టెంట్ నుండి ఎంతో కొంత నేర్చుకోగలిగానని మాత్రం చెప్పగలుగుతున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభమైనప్పటి నుండి KBCకి హోస్ట్‌గా ఉన్నారు, 2007లో షారుఖ్ ఖాన్ మూడవ సీజన్ హోస్ట్ చేశారు. ప్రస్తుతం "జుండ్", "బ్రహ్మాస్త్ర", "మేడే" వంటి ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ఉన్నారు బిగ్ బీ.


Next Story