ముంబైలో అల్లు అర్జున్ కలిసింది అతడినేనా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకుని

By Medi Samrat  Published on  23 Sept 2023 5:02 PM IST
ముంబైలో అల్లు అర్జున్ కలిసింది అతడినేనా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేశాడు. తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సీక్వెల్ షూటింగ్ లో భాగమయ్యాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నాడో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఇంతలో అల్లు అర్జున్ ముంబైకి వెళ్లడంపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తూ ఉంది. అల్లు అర్జున్ ముంబైలో దర్శకుడు అట్లీతో సమావేశమయ్యాడని తెలుస్తోంది. జవాన్ విడుదలకు ముందే అట్లీ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా గురించి చర్చ జరిగింది. ఇప్పుడు జవాన్ బాలీవుడ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయడంతో, అల్లు అర్జున్ అట్లీతో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తిని కనబరుస్తున్నాడని తెలుస్తోంది. జవాన్ వంటి భారీ విజయం తర్వాత అట్లీకి అద్భుతమైన క్రేజ్ వచ్చింది. అతనితో పని చేయడానికి పలువురు బాలీవుడ్ నటులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే అట్లీ తన తదుపరి సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Next Story